ఢిల్లీ మాయాపురి ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం..
- August 09, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో మాయాపురిలోని ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 9మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 2.05 గంటలకు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక శాఖ వాహనాలు వచ్చి మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. సోఫా స్ప్రింగ్ బాక్సులో మంటలు రాజుకున్నాయి.
మంటల్లో చిక్కుకున్న 9 మంది ఫ్యాక్టరీ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఫ్యాక్టరీ కార్మికులను దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అవుటర్ ఢిల్లీ ఉద్యోగనగర్ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో జులై 30వతేదీన అగ్నిప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







