రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- July 01, 2026
యూఏఈ: రాస్ అల్ ఖైమాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ స్టూడెంట్ మరణించాడు. సదరు స్టూడెంట్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ఓ ట్రైలర్ ను ఢీకొట్టింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ప్రమాదంలో మరణించిన 18 ఏళ్ల సలేం అల్ మజ్రూయీ తండ్రి అలీ రషీద్ అల్ మజ్రూయీ మాట్లాడుతూ.. ఫైనల్ పరీక్ష కోసం తన కుమారుడు 'అల్ ఘైల్'లోని తన ఇంటి నుండి రాస్ అల్ ఖైమాలోని 'అధెన్' ప్రాంతంలో ఉన్న పాఠశాలకు వెళ్తున్నాడని చెప్పాడు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనాన్ని నడుపుతున్న అతని స్నేహితుడు కూడా అతనితో పాటు ఉన్నాడని తెలిపాడు.
రోడ్డు కుడి వైపు నుండి ట్రక్కు అకస్మాత్తుగా ప్రధాన రహదారిపైకి వచ్చిందని, వాహనం నడుపుతున్నతన కుమారుడి స్నేహితుడు ఆ ట్రక్కును తప్పించుకోవడానికి ప్రయత్నించాడని, కానీ చివరకు వారు ఆ ట్రైలర్ వెనుక భాగాన్ని ఢీకొట్టారని వివరించాడు. ఈ ప్రమాదంలో సలేం మరణించగా, అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు.
తాజా వార్తలు
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!







