యూఏఈ లో డ్రైవర్లు, సూపర్వైజర్ల నియామకం
- August 09, 2023
యూఏఈ: రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) అనుబంధ సంస్థ అయిన దుబాయ్ టాక్సీ కార్పొరేషన్ (DTC) డ్రైవర్లు, సూపర్ వైజర్ ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని దేశాలకు చెందిన అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. లిమోసిన్ డ్రైవర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు రెండేళ్ల అనుభవం ఉన్న యూఏఈ లేదా జీసీసీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. స్కూల్ బస్ డ్రైవర్ స్థానాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 23 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎంపికైన వారికి Dh2,700 జీతంతోపాటు ఇతర అలవెన్సులను అందిజేస్తారు. బస్ సూపర్వైజర్లు/అటెండెంట్ల కోసం 23 నుండి 45 సంవత్సరాల వయస్సు గల మహిళా అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి Dh1,500-Dh1,800 నెలవారీ జీతం, ఇతర ప్రయోజనాలు అందజేస్తారు. డ్రైవర్లు మరియు సూపర్వైజర్ల ఉద్యోగాల కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలు ఆగస్ట్ 11న ఉదయం 7 నుండి 11 గంటల వరకు ప్రివిలేజ్ లేబర్ రిక్రూట్మెంట్ ఆఫీస్ M-11, అబు హేల్ సెంటర్లో జరుగుతాయని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







