మస్కట్, సోహార్‌లలో తెల్లవారుజామున 4.30 గంటలకు ‘జైలర్’ ఫస్ట్ షో
- August 09, 2023
మస్కట్: సూపర్ స్టార్, రజనీకాంత్ నటించిన 'జైలర్' మొదటి రోజు మొదటి షో గురువారం మస్కట్, సోహార్‌లో తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభమవుతుంది. వోక్స్ సినిమాస్ వెబ్సైట్లో ఈ మేరకు పేర్కొన్నారు. సినీ ప్రియులు అజైబా, సిటీ సెంటర్ మస్కట్, సిటీ సెంటర్ ఖురమ్, మాల్ ఆఫ్ ఒమన్, MGM మరియు సిటీ సెంటర్ సోహార్‌లలో ఉదయం 4.30 గంటలకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. “ఫస్ట్ డే ఫస్ట్ షో తెల్లవారుజామున 4.30కి అది కూడా వర్కింగ్ డేలో చూడడం చాలా అరుదు. ఒమన్‌లో రజనీకాంత్‌కు ఎంత ఆదరణ ఉందో ఇది స్పష్టంగా చూపిస్తుంది” అని భారతదేశంలోని చెన్నైకి చెందిన భారతీయ ప్రవాసుడు సెల్వన్ తెలిపారు.
రూ.200 కోట్ల (OMR100,000) బడ్జెట్‌తో రూపొందించబడిన ‘జైలర్’ భారతీయ తమిళ భాష బ్లాక్ కామెడీ-యాక్షన్ చిత్రం. దీనికి నెల్సన్ రచన, దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్‌కు చెందిన కళానిధి మారన్ ఈ చిత్రాన్న నిర్మించారు. ఇందులో రజనీకాంత్ టైటిల్ రోల్లో నటించగా.. ఇతర పాత్రల్లో మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్య కృష్ణన్, వినాయకన్, మిర్నా మీనన్ మరియు తమన్నా భాటియా నటించారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ వెండితెరపై కనిపిస్తున్న చిత్రం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







