సీఎం జగన్తో టీటీడీ నూతన ఛైర్మన్ భూమన భేటి
- August 09, 2023
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ ను ఈరోజు ఆయన కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా జగన్ ను కలిశారు. టీటీడీ ఛైర్మన్ గా తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా భూమన కుమారుడు అభినయ్ రెడ్డి కూడా ఉన్నారు.
రేపు ఉదయం టీటీడీ ఛైర్మన్ గా భూమన బాధ్యతలను చేపట్టనున్నారు. మరోవైపు టీటీడీ ఛైర్మన్ గా భూమన బాధ్యతలను చేపట్టడం ఇది రెండోసారి. 2006-2008 మధ్య ఆయన తొలిసారి ఛైర్మన్ బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుతం భూమన తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడిగా భూమనను జగన్ నియమించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







