కరీంనగర్లో NIA సోదాలు
- August 10, 2023
కరీంనగర్: కరీంనగర్ పట్టణంలో ఎన్ఐఏ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు కలకలం సృష్టించాయి. అనుమానితుని కోసం ఎన్ఐఏ అధికారులు నగరంలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందం.. ఏఆర్ పోలీసుల బందోబస్తు మధ్య సోదాలు చేపట్టింది.
కరీంనగర్ హుస్సేనీపురకు చెందిన తబరేజ్ కు గతంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను విదేశాల్లో ఉపాధి పొందతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్ఐఏ అధికారుల బృందం అతని ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా కరీంనగర్ కు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెల్లవారు జామునే కరీంనగర్ చేరుకున్న టీమ్ ఎన్ఐఏ డీఎస్పీ రాజేష్ ఆధ్వర్యంలో.. అనుమానిత వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేపట్టింది. అధికారులు తనిఖీలు చేస్తున్న ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







