సినిమా రివ్యూ: ‘జైలర్’
- August 10, 2023
నటీనటులు: రజనీకాంత్, తమన్నా, రమ్యకృష్ణ, సునీల్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, వసంత్ రవి, నాగబాబు తదితరులు.
దర్శకుడు: నెల్సన్ దిలీప్ కుమార్
నిర్మాతలు: కళానిధి మారన్
సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్
సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఎప్పుడూ అదో సెన్సేషనే. రిలీజ్‌కి ముందే రికార్డులు సృష్టించేస్తుంటాయ్ రజనీకాంత్ సినిమాలు. అయితే, ఈ మధ్య కేవలం ప్రీ రిలీజ్ రికార్డులకే తప్ప, రిలీజ్ తర్వాత సినిమా వుండట్లేదు రజనీకాంత్‌కి. అలాంటిది నెల్సన్ దిలీప్ నుండి వచ్చిన తాజా సినిమా ‘జైలర్’పై అంచనాలయితే బాగానే నెలకొన్నాయ్.
ప్రచార చిత్రాలతో పాజిటివ్ బజ్ క్రియేట్ చేశారు. అయితే, సినిమా రికార్డులు బద్దలుకొట్టేలా వుందా.? ఈ సినిమాతో రజనీకాంత్ కమ్ బ్యాక్ అవుతారా.? అనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!
కథ:
ముత్తు వెల్ పాండియన్ (రజనీకాంత్) గతంలో ఓ స్ట్రిక్ట్ జైలర్. కానీ, ప్రస్తుతం ఆ జాబ్ నుంచి తప్పుకుని ఫ్యామిలీతో మనవడితో సరదాగా కాలం గడిపేస్తుంటాడు. ముత్తు కొడుకు ప్రముఖ ఏసీపీ ఆఫీసర్. అయితే, కొన్ని కారణాల వల్ల ఏసీపీ ఆపీసర్‌ని కొందరు దుండగులు చంపేస్తారు. కొడుకును చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ముత్తు హత్యలు చేస్తుంటాడు. ఈ క్రమంలో కొడుకు గురించి కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయ్ ముత్తుకి. ఈ నేపథ్యంలోనే తన ఫ్యామిలీ ప్రమాదంలో పడుతుంది. ఆ ప్రమాదం నుంచి ఫ్యామిలీని కాపాడుకోవడానికి ముత్తు ఏం చేశాడు.? చివరికి అనుకున్నది సాధించాడా.? అసలు కొడుకు విషయంలో ముత్తు తెలుసుకున్న నిజాలేంటీ.? తెలీయాలంటే ‘జైలర్’ సినిమా ధియేటర్లో చూడాల్సిందే.
నటీనటుల పని తీరు:
ఎప్పటిలాగే తనదైన బాడీ లాంగ్వేజ్, స్టైలిష్ లుక్స్‌తో రజనీకాంత్ ఫ్యాన్స్‌కి కొత్త ట్రీట్ ఇచ్చారు. సందర్భానికి తగ్గట్టుగా యాక్టింగ్‌లో వేరియేషన్స్ చూపిస్తూ మెస్మరైజ్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, ప్రజెంట్ సిట్యువేషన్స్.. ఇలా రకరకాల వేరియేషన్స్‌లో రజనీకాంత్ టాప్ రేంజ్ పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇక, హీరోయిన్‌గా తమన్నా పాత్రకు ప్రాధాన్యత తక్కువే అని చెప్పాలి. ‘వా కావాలయ్యా..’ సాంగ్‌లో అదరగొట్టేసింది తమన్నా. రమ్యకృష్ణ తల్లి పాత్రలో ఏజ్ యూజ్‌వల్ మెప్పించింది. సునీల్ ఓ సర్‌ప్రైజింగ్ రోల్‌లో కనిపించి మెప్పించాడు. అతిధి పాత్రల్లో వచ్చిన జాకీ ష్రాఫ్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ సినిమాకి ప్లస్ అయ్యారు. యోగిబాబు తదితర నటీ నటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ స్టైల్ తెలిసిందే. ఆయన గత చిత్రాలతో పోల్చితే, ఈ సినిమాలో సీనియర్ స్టార్ అయిన రజనీకాంత్‌తో చేయించిన యాక్షన్ ఎపిసోడ్స్ మెచ్చుకోదగ్గవి. సినిమాకి హైలైట్‌గా నిలిచాయ్. టైటిల్‌కి తగ్గట్టుగా ‘జైలర్’ పాత్రను చాలా శక్తివంతంగా డిజైన్ చేశాడు డైరెక్టర్. అయితే, క్యారెక్టర్‌లో వున్న స్ర్టెంత్ కథనాన్ని నడిపించడంలో మిస్ అయ్యింది. చాలా స్లోగా అనిపిస్తుంది నెరేషన్. నెల్సన్ తన గత సినిమాల ఫ్లేవర్స్ అన్నింటినీ ఈ సినిమాలో మిక్సింగ్ చేసి వదిలినట్లనిపిస్తుంది.
అనిరుధ్ రవిచంద్రన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో అనిరుధ్ అదరగొట్టేశాడు ఆర్ఆర్‌తో. విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ బాగున్నప్పటికీ, కత్తెర పడాల్సిన సన్నివేశాలు చాలానే వున్నాయ్. నిర్మాణ విలువలు బాగున్నాయ్.
ప్లస్ పాయింట్స్:
వేగంగా నడిచిన ఫస్టాప్, ఇంటర్వెల్ బ్యాంగ్, కథకు టర్నింగ్ పాయింట్ అయిన కొడుకు పాత్ర, యాక్షన్ ఎపిసోడ్స్, అక్కడక్కడా కొన్ని ఎమోషనల్ సీన్స్, గెస్ట్ అప్పియరెన్సెస్..
మైనస్ పాయింట్స్:
స్లో నెరేషన్, సాగతీతగా అనిపించిన కొన్ని ఎమోషన్ సీన్లు, సెకండాఫ్..
చివరిగా: మోస్ట్ సీనియారిటీ అనదగ్గ నటీనటుల్ని వాడినా.. ‘జైలర్’ కేవలం సూపర్ స్టార్ అభిమానులకు మాత్రమే.!
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్‌లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!