కేంద్రం మరో వివాదాస్పద బిల్లు..
- August 10, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీ ప్రతేక అధికారాల బిల్లును ఆమోదింప చేసుకున్న కేంద్ర ప్రభుత్వం మరో వివాదాస్పద బిల్లును తెరపైకి తీసుకొచ్చింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నియమాక ప్యానెల్ నుంచి సీజేఐ నుంచి తప్పించేలా బిల్లును తెచ్చింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నియామకంలో భారత ప్రధాన న్యాయమూర్తి ప్రమేయాన్ని తొలగించేలా బిల్లును రూపొందించింది.
చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ నియామకంలో ప్రధానమంత్రి సభ్యుడిగా ఉన్న కమిటీ, లోక్ సభ ప్రతిపక్షనేత, సీజేఐ కలిసి సీఈసీని నియమించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్(సీఈవో) నియామకాన్ని ప్రధానమంత్రి సభ్యుడిగా ఉన్న కమిటీ, లోక్ సభ ప్రతిపక్షనేత, సీజేఐకి కట్టబెడుతూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానికి వ్యతిరేకంగా కేంద్రం ఈ బిల్లును తెచ్చింది.
ఎన్నికల ప్రధాన అధికారి నియామకంలో సీజేఐకి ప్రమేయం లేకుండా ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లు చట్టం రూపం దాల్చితే సీఈసీ నియామక కమిటీల్లో సీజేఐకి ఎలాంటి అధికారం ఉండదు.
మార్చిలో సీజేఐ ఈ ఆదేశాలు ఇచ్చారు. కోలీజియం వ్యవస్థపై ఇప్పటికే కేంద్రానికి, సుప్రీంకోర్టుకు మధ్య విబేధాలు ఉన్నాయి.
ప్రధాన ఎన్నికల అధికారి నియామకంలోనూ సీజేఐ జోక్యం ఉండేలా తీర్పు ఇవ్వడం పట్ల కేంద్రం పెద్దలు అసంతృప్తిగా ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఐదు నెలల తర్వాత కేంద్రం ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుతో ఇది నిజమేనని తేలింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







