శంషాబాద్ విమానాశ్రయం లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్
- May 17, 2016
శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఎమిరేట్స్ ఫ్లయిట్లో దుబాయి నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద 2 కిలోల కొకైన్ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సదరు విమానంలోని ప్రయాణికులు కొకైన్ తీసుకువస్తున్నట్లు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు ముందస్తుగా సమాచారం అందింది. దీంతో వారు అప్రమత్తమయ్యారు.
అందులోభాగంగా ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే సదరు మహిళపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ... అదుపులోకి తీసుకుని... దాదాపు రెండు గంటల పాటు విచారించారు. ఆ మహిళ వద్ద ఉన్న ఐదు పుస్తకాలకు రెండు వైపులా అల్యూమినియం ఫాయిల్ కవర్లు ఉండడంతో విప్పి చూశారు. దీంతో పుస్తకాల పేపర్లలో కొకైన్ తీసుకువస్తున్నట్లు ఆమె అంగీకరించింది. 2 కేజీల కొకైన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ రూ. 10 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెప్పారు
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







