బిఆర్ఎస్ కు పేదల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు: కిషన్ రెడ్డి
- August 12, 2023
హైదరాబాద్: కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సిఎం కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. శనివారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ అబద్దాలకు ప్రతిరూపమని విమర్శించారు. పాత హామీలనే కొత్తగా చెబుతూ మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అడుగడుగునా అన్యాయం రాజ్యమేలుతుందని దుయ్యబట్టారు. అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలోనూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రగతి భవన్ ను నాలుగు నెలల్లో, సచివాలయాన్ని ఎనిమిది నెలల్లో నిర్మించుకున్న కెసిఆర్.. పేద ప్రజలకు ఇళ్లు కట్టడానికి మాత్రం ఏళ్ల సమయం తీసుకుంటున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ కు పేదల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఇళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని 2017 లో చెప్పిన కెసిఆర్ ఇప్పుడు మరోసారి ఎన్నికలకు ఎలా వెళతారని ప్రశ్నించారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







