వద్దు గురూజీ వద్దు.. మహేష్ బాబు.!
- August 12, 2023
‘గుంటూరు కారం’ సినిమాకి సంబంధించి సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకింత అసహనంగా వున్నారట. మహేష్ బాబే కాదు, ఈ సినిమా విషయమైన మహేష్ ఫ్యాన్స్ కూడా గుస్సా అవుతున్నారు.
మొన్నటికి మొన్న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఏ ఒక్క అప్డేట్ ఇవ్వకపోవడం మినహా.. సినిమా షూటింగ్ స్టేటస్ ఎంత వరకూ వచ్చిందన్న దానిపైనా క్లారిటీ లేదింతవరకూ.
ఇదిలా వుంటే, సినిమాలో ఓ ఇంపార్టెంట్ సీన్ పట్ల మహేష్ బాబు ఒకింత అసంతృప్తిగా వున్నాడట. ఆ సీన్‌లో మార్పులు చేయాలని త్రివిక్రమ్‌కి సూచిస్తున్నాడట. మరి, త్రివిక్రమ్ ఏం చేస్తాడో చూడాలి మరి.
ఇదిలా వుంటే, ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్లలో ఇప్పటికే గందరగోళం వుంది. పూజా హెగ్ధే తప్పుకోవడంతో, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయితే అయ్యారు కానీ, అయినా ఏదో గందరగోళం. సినిమాటోగ్రఫర్ విషయంలోనూ, మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనూ ఇవే గందరగోళాలు.. ‘గుంటూరు కారం’ ప్రాజెక్ట్‌కి సంబంధించి తెర వెనుక జరుగుతున్న ఈ గందరగోళానికి చెక్ పెట్టాలంటే, సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఒకటి వదిలి తీరాల్సిందే.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









