సలాలాలో క్రిప్టోకరెన్సీ మైనింగ్ హోస్టింగ్ ప్రారంభం
- August 14, 2023
సలాలా: అసయాద్ గ్రూప్ అనుబంధ సంస్థ డేటా ప్రాసెసింగ్, క్రిప్టోకరెన్సీ మైనింగ్ హోస్టింగ్ కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రాజెక్ట్ మొదటి దశను సలాలాలోని ఫ్రీ జోన్‌లో ప్రారంభించింది. ఈ కేంద్రం అఫాక్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్ సంస్థ అనుబంధ సంస్థ అయిన ఎక్సాహెర్ట్జ్ ఇంటర్నేషనల్ కంపెనీకి చెందినది. ప్రారంభోత్సవానికి రవాణా, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి హమూద్ అల్ మవాలీ, ధోఫర్ గవర్నర్ హెచ్‌హెచ్ సయ్యద్ మర్వాన్ తుర్కీ అల్ సైద్ హాజరయ్యారు. ప్రాజెక్ట్ మొదటి దశ ప్రారంభోత్సవం డిజిటల్ పెట్టుబడులను ప్రోత్సహించడం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్థానికీకరించడంపై మంత్రిత్వ శాఖ ఆసక్తిని ప్రతిబింబిస్తుందని అల్ మవాలీ తెలిపారు. ప్రాజెక్ట్‌కు బాధ్యత వహిస్తున్న కంపెనీ 2023 ముగిసేలోపు ఊహించిన ఉత్పత్తి పరిమాణంలో నాలుగింట ఒక వంతు సాధించగలదని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







