యూఏఈ పోలీసుల స్కామ్ అలెర్ట్
- August 14, 2023
యూఏఈ: బాధితులను తప్పుదారి పట్టించడంలో మోసగాళ్లు ఉపయోగించే వివిధ పద్ధతులకు వ్యతిరేకంగా అబుధాబి పోలీసులు నివాసితులను హెచ్చరించారు. మోసపూరిత కాల్లు, వెబ్సైట్లకు లింక్‌లు, నకిలీ SMS సందేశాల ద్వారా ప్రభుత్వ సంస్థల వలె నటించడం, ప్రజలకు నకిలీ సేవలు ఆఫర్ చేయడం, ప్రలోభాలకు గురిచేసే ఆఫర్ల ద్వారా స్కామర్లు బాధితులను తప్పుదారి పట్టిస్తారని పేర్కొంది. మోసపూరిత ఇంటర్నెట్ సైట్లు క్రెడిట్ కార్డుల చెల్లింపులపై ప్రత్యేక ఆఫర్లను అందించి మోసానికి పాల్పడతాయని, అలాంటి ప్రకటనలకు ఇంటరాక్ట్ కావద్దని సూచించింది. ఉద్యోగార్థులు ‘నకిలీ రిక్రూట్మెంట్’ పోస్టులపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇతరులతో ఖాతా లేదా కార్డ్ సమాచారం, ఆన్లైన్ బ్యాంకింగ్ పాస్వర్డ్లు లేదా ATM సెక్యూరిటీ నంబర్ (CCV) లేదా పాస్వర్డ్ వంటి వారి రహస్య సమాచారాన్ని పంచుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ బ్యాంకింగ్ వివరాలను అప్డేట్ చేయమని అభ్యర్థిస్తూ ఎవరైనా గుర్తు తెలియని వారు వచ్చినా.. ఏవైనా కాల్స్ వచ్చినా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి త్వరగా రిపోర్ట్ చేయాలని ప్రజలను అబుధాబి పోలీసులు కోరారు. భద్రతా సేవా నంబర్ 8002626కి కాల్ చేయవచ్చని లేదా 2828కి SMS పంపవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







