సూడాన్‌కు ఆయుధాల సరఫరా ఆరోపణలను ఖండించిన యూఏఈ
- August 14, 2023
యూఏఈ: సూడాన్‌లో పోరాడుతున్న పార్టీలకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసిందని మీడియాలో వస్తున్న ఆరోపణలను యూఏఈ తీవ్రంగా ఖండించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అఫ్రా అల్ హమేలీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 2023లో అంతర్యుద్ధం ప్రారంభమైన నుండి సూడాన్‌లో పోరాడుతున్న ఏ పక్షాలకు యూఏఈ ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని సరఫరా చేయలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, సుడాన్ ప్రస్తుత సంఘర్షణలో యూఏఈ ఏ పక్షం వహించదని అల్ హమేలీ పునరుద్ఘాటించారు. సంఘర్షణకు ముగింపు పలకాలని, సూడాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ ప్రక్రియకు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జాతీయ ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రయత్నాలకు యూఏఈ మద్దతు ఇస్తోందన్నారు. కాల్పుల విరమణ పాటించే వరకు సుడాన్లో భద్రతను నెలకొనదని తెలిపారు. సూడానీస్ శరణార్థులకు మద్దతుగా ఫీల్డ్ హాస్పిటల్‌ను స్థాపించినట్లు గుర్తుచేశారు. పిల్లలు, వృద్ధులు మరియు మహిళల కోసం సుమారు 2,000 టన్నుల వైద్యం, ఆహారం, ఉపశమన సామాగ్రిని అందించినట్లు గుర్తుచేసారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







