కుమారుడి కోసం తానే గెస్ట్ అవతారమెత్తిన కింగ్.!

- August 14, 2023 , by Maagulf
కుమారుడి కోసం తానే గెస్ట్ అవతారమెత్తిన కింగ్.!

అక్కినేని నాగ చైతన్య సినిమాలో నాగార్జున ఓ కీ రోల్‌లో కనిపించబోతున్నాడనీ సమాచారం. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇంకా పట్టాలెక్కలేదు కానీ, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది ఈ సినిమాకి సంబంధించి.

మత్స్యకార నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో నాగార్జున కోసం ఓ ఇంపార్టెంట్ రోల్ డిజైన్ చేశాడట చందూ మొండేటి. వాస్తవానికి ఈ రోల్‌లో ఓ సీనియర్ హీరోని తీసుకోవాలనుకున్నారట. ఆ సీనియర్ హీరో మరెవరో ఎందుకు.? తండ్రి నాగార్జుననే తీసుకుంటే పోలా.! అని అనుకుంటున్నారట.

ఇంకా ఈ విషయంపై క్లారిటీ రాలేదు కానీ, జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. త్వరలోనే ఈ ప్రచారానికి సంబంధించి క్లారిటీ రానుంది.

అన్నట్లు గతంలో చందూ మొండేటితో ‘సవ్యసాచి’ సినిమాలో నటించాడు నాగ చైతన్య. ‘కార్తికేయ 2’తో బంపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్‌గా చందూ మొండేటి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com