కుమారుడి కోసం తానే గెస్ట్ అవతారమెత్తిన కింగ్.!
- August 14, 2023
అక్కినేని నాగ చైతన్య సినిమాలో నాగార్జున ఓ కీ రోల్లో కనిపించబోతున్నాడనీ సమాచారం. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇంకా పట్టాలెక్కలేదు కానీ, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది ఈ సినిమాకి సంబంధించి.
మత్స్యకార నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో నాగార్జున కోసం ఓ ఇంపార్టెంట్ రోల్ డిజైన్ చేశాడట చందూ మొండేటి. వాస్తవానికి ఈ రోల్లో ఓ సీనియర్ హీరోని తీసుకోవాలనుకున్నారట. ఆ సీనియర్ హీరో మరెవరో ఎందుకు.? తండ్రి నాగార్జుననే తీసుకుంటే పోలా.! అని అనుకుంటున్నారట.
ఇంకా ఈ విషయంపై క్లారిటీ రాలేదు కానీ, జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. త్వరలోనే ఈ ప్రచారానికి సంబంధించి క్లారిటీ రానుంది.
అన్నట్లు గతంలో చందూ మొండేటితో ‘సవ్యసాచి’ సినిమాలో నటించాడు నాగ చైతన్య. ‘కార్తికేయ 2’తో బంపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్గా చందూ మొండేటి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







