521 మనీ-లాండరింగ్ కేసుల్లో 387 మంది అరెస్ట్
- August 15, 2023
యూఏఈ: గత రెండు సంవత్సరాలలో 521 మనీలాండరింగ్ కేసులను సమర్థవంతంగా పరిష్కరించినట్లు యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈకేసులో ప్రపంచవ్యాప్తంగా 387 మంది వ్యక్తులను పట్టుకోవడానికి అంతర్జాతీయ చట్టాల అమలు సంస్థలతో కలిసి పనిచేసినట్టు పేర్కొంది. ఆయా కేసుల్లో Dhs4 బిలియన్లను మించి ఆస్తులను, బ్యాంకు డిపాజిట్లు, అకౌంట్లను ప్రీజ్ చేసినట్లు ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వెల్లడించారు. మనీలాండరింగ్‌కు వ్యతిరేకంగా జాతీయ వ్యూహాన్ని పర్యవేక్షించడానికి విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నేతృత్వంలోని మనీలాండరింగ్ నిరోధక చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. అదే సమయంలో ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడంపై జాతీయ వ్యూహాన్ని పర్యవేక్షించే ఉన్నత కమిటీ చేపట్టిన తీవ్రమైన చర్యలను చేపట్టినట్లు షేక్ సైఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







