ఒమన్ లో కింగ్ ఫిష్ వ్యాపారం, వేటపై రెండు నెలలు నిషేధం
- August 16, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో ఆగస్టు 15 నుండి అక్టోబర్ 15 వరకు రెండు నెలల పాటు కింగ్‌ఫిష్ చేపలు పట్టడం మరియు వ్యాపారం చేయడంపై నిషేధం విధించారు. ఈ మేరకు ఒమన్ వ్యవసాయ, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) ఉత్తర్వులు జారీ చేసింది. సుల్తానేట్‌లో ఈ ఏడాది 2023లో చేపలు పట్టడం, కింగ్‌ఫిష్ చేపల వ్యాపారంపై నిషేధం అమలును ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నిబంధనల ప్రకారం ఆగస్టు 15 నుండి నుండి అక్టోబర్ 15 వరకు రెండు నెలల పాటు నిషేధం విధిస్తూ మంత్రివర్గ తీర్మానం నం. (230/2014 AD) చేశారు. ఫిషింగ్, మార్కెటింగ్ మరియు ఎగుమతి చేసే కింగ్ఫిష్లో పనిచేసే అన్ని మత్స్యకారులు, చేపల వాహకాలు, కంపెనీలు మరియు సంస్థలు దీనికి కట్టుబడి ఉండాలని ఆదేశించింది. కింగ్ ఫిష్ రిజిస్టర్ చేయబడితే తప్ప నిషేధ కాలంలో వాణిజ్యం లేదా ఎగుమతి చేయడానికి అనుమతించరు. ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు, జరిమానాలను విధించనున్నట్లు మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







