యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆన్లైన్ లాగ్ ఇన్ పద్ధతిలో మార్పు
- August 16, 2023
యూఏఈ: లాగ్ ఇన్ పద్ధతిలో మార్పులు చేసినట్టు నివాసితులకు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలియజేసింది. కొత్త మార్పులు ఆగస్టు 31న అమల్లోకి వస్తాయని అధికార యంత్రాంగం ట్విట్టర్లో పోస్ట్‌లో పేర్కొంది. యూఏఈ నివాసితులు ఇకపై యూఏఈ పాస్‌ను ఉపయోగించడం ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు లాగిన్ కావచ్చు. యూఏఈ పాస్ యాప్ యాపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.
ఇది ఎలా పని చేస్తుందంటే..
డౌన్ లోడ్ తర్వాత వినియోగదారులు వారి ఎమిరేట్స్ ఐడీని స్కాన్ చేయడం, డేటాను ధృవీకరించడం, పిన్(PIN)ని సెట్ చేయడం, ముఖ గుర్తింపు ద్వారా ఖాతాను ధృవీకరించడం ద్వారా వారి డిజిటల్ గుర్తింపు ఖాతాను యాక్టివేల్ చేయొచ్చు. అనంతరం యూఏఈ పాస్ని సెటప్ చేసి, యాక్టివేట్ చేసిన తర్వాత యూజర్లు యూజర్‌నేమ్‌లు, పాస్వర్డ్లు లేకుండా స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా సేవలను యాక్సెస్ కావచ్చు. పత్రాలపై డిజిటల్‌గా సంతకం చేయవచ్చు. యూఏఈ పాస్ వివిధ వెబ్సైట్లు, యూఏఈ అంతటా ప్రభుత్వ మరియు పాక్షిక-ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీల కోసం అప్లికేషన్లకు సురక్షితమైన లాగిన్ విధానాన్ని అందిస్తుంది. ఇది స్థానిక, సమాఖ్య ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ రంగంలో 130 కంటే ఎక్కువ సంస్థలు అందించిన 6,000 కంటే ఎక్కువ సేవలకు వినియోగదారులకు యాక్సెస్‌ను అందిస్తుంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







