రీమేక్స్ జోలికి పోనంటోన్న బాలయ్య.!

- August 17, 2023 , by Maagulf
రీమేక్స్ జోలికి పోనంటోన్న బాలయ్య.!

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా రీమేక్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వద్దు బాబోయ్ రీమేకులు అంటున్నా వినకుండా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆయా రీమేక్స్‌లో నటిస్తూనే వున్నారు.

అయితే, చిరంజీవికి ‘భోళా శంకర్’ రూపంలో పెద్ద డిజాస్టర్ తగిలింది. దాంతో, ఆలోచన మార్చుకోవల్సి వచ్చింది. ఇక, బాలయ్య విషయానికి వస్తే, రీసెంట్‌గా ఓ రీమేక్ సబ్జెక్ట్ బాలయ్య చెంతకూ వచ్చిందట. 

అయితే, ప్రస్తుత పరిస్థితులు బాలయ్యకు ముందుగానే బోధపడ్డాయ్ కాబోలు.. ఆ రీమేక్‌ని సున్నితంగా తిరస్కరించాడట బాలయ్య. అయితే, ఇప్పటికైతే రిజెక్ట్ చేశాడు కానీ, భవిష్యత్తులో ఆ రీమేక్‌లో నటించే అవకాశముందనీ అంటున్నారు.

ఓ ప్రముఖ డైరెక్టర్ ఈ రీమేక్‌ని బాలయ్యతో తెరకెక్కించాలనుకుంటున్నాడట. అయితే, ఇప్పటికిప్పుడు కాకపోయినా, ఎప్పటికైనా బాలయ్యతోనే ఆ రీమేక్ చేయాలనుకుంటున్నాడట ఆ డైరెక్టర్. ఇంతకీ ఎవరా డైరెక్టర్.? ఏంటా కథ.? తెలియాల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com