స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలు
- May 18, 2016
మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (ఎంబిఆర్‌ఎస్‌సి) 35 ఉద్యోగావకాశాల కోసం ప్రకటన విడుదల చేసింది. ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఈ ఉద్యోగావకాశాల్ని కల్పిస్తున్నట్లు కెరీర్స్ యూఏఈ 2016 ఎగ్జిబిషన్ సందర్భంగా వెల్లడించింది. అంతరిక్ష రంగంలో అద్భుతమైన అవకాశాలు ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నాయనీ, పరిశోధన రంగంలో యువత చూపుతున్న ఆసక్తి ఆహ్వానించదగ్గదని ఎగ్జిబిషన్‌లో ఎంబిఆర్‌ఎస్‌సి ప్రతినిథులు చెప్పారు. టెక్నాలజీ, మెకానికల్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, లాజిస్టిక్స్, ఇమేజ్ ప్రాసెసింగ్, శాటిలైట్ అండ్ గ్రౌండ్ ఆపరేషన్స్, అప్లికేషన్ డెవలప్‌మెంట్ మరియు ఎనాలసిస్, సస్టెయినబుల్ ఎనర్జీ, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ మరియు పబ్లిక్ రిలేషన్స్, ఆర్గనైజేషనల్ డెవలప్‌మెంట్, హ్యూమన్ రిసోర్సెస్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, కాంట్రాక్ట్స్ విభాగాల్లో ఉద్యోగాలు ఔత్సాహికుల కోససం ఎదురుచూస్తున్నట్లు ఎంబిఆర్‌ఎస్‌సి వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఎంబీఆర్‌ఎస్‌సి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌ని నిర్వహించి, స్పెషలైజ్డ్ నేషనల్ ప్రొఫెషనల్స్‌ని తయారుచేస్తుంది. అంతరిక్ష రంగంలో అద్భుతాలు సృష్టించేందుకు అనుగుణంగా యువతను మెరికల్లా తయారుచేసేందుకు ఎంబిఆర్‌ఎస్‌సి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆ సంస్థ ప్రతినిథులు చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







