హిద్ వర్క్‌సైట్‌లో ఆసియా కార్మికుడి మృతి
- May 18, 2016
హిద్ ఇండస్ట్రియల్ ఏరియాలోని వర్క్ సైట్‌లో ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. అరేబియన్ షిప్ రిపెయిర్స్ యార్డ్, ఓ పత్రికా ప్రకటనలో ప్రమాదం గురించిన వివరాల్ని తెలియజేసింది. మృతి చెందిన కార్మికుడు బంగ్లాదేష్ జాతీయుడిగా గుర్తించారు. డ్రై డాక్ యార్డ్‌లో కార్మికుడు పనిచేస్తుండగా ప్రమావశాత్తూ వెస్సెల్ కూలడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడ్డ అతనికి తక్షణ వైద్య చికిత్స అందించినా, ప్రాణాలు కాపాడలేకపోయామని సంస్థ ప్రకటించింది. ప్రమాద ఘటనపై విచారణ జరుగుతోందని అరేబియన్ షిప్ యార్డ్ రిపెయిర్స్ కంపెనీ ప్రతినిథులు చెప్పారు. తమ సంస్థలో భద్రత పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ, దురదృష్టవశాత్తూ ఈ సంఘటన జరిగిందనీ, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టియన్ బెర్జ్ చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







