అడిస్ అబాబా చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు
- August 19, 2023
యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియాలో అధికారిక పర్యటన కోసం అడిస్ అబాబా చేరుకున్నారు. బోలే అడిస్ అబాబా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబియ్ అహ్మద్ స్వాగతం పలికారు. ఇథియోపియాలో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అధికారిక పర్యటనలో రెండు దేశాల అభివృద్ధికి ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా వ్యవసాయం, ఆహార భద్రత, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత మరియు ఇతర రంగాలలో సహకారానికి ఇరుదేశాల ప్రతినిధుల బృందాలు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రిసెప్షన్ కార్యక్రమానికి ఇథియోపియా నుంచి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







