ఇండియా 'డిజిటల్ ఇన్నోవేషన్' పోటీకి రెండు ఒమానీ కంపెనీలు
- August 19, 2023
మస్కట్: భారతదేశంలో G20 సదస్సులో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ పాల్గొంటున్న నేపథ్యంలో ఒమానీకి చెందిన రెండు కంపెనీలు "డిజిటల్ ఇన్నోవేషన్" పోటీలో పాల్గొననున్నాయి. ఇందులో మొత్తం 29 దేశాల నుండి 115 స్టార్టప్‌లు పాలు పంచుకుంటున్నాయి. ఒమన్ రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) ఆధ్వర్యంలో ఒమానీ టెక్నాలజీ కంపెనీలకు అవకాశం కల్పించారు. ఈరెండు ఒమానీ కంపెనీలు (రాహల్(Rehal), H2SolarO) ఇండియాలో జరిగే G20 సమ్మిట్ కార్యకలాపాలలో భాగంగా నిర్వహిస్తున్న “డిజిటల్ ఇన్నోవేషన్” పోటీలో పాల్గొంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆగస్టు 17-19 వరకు పాంగ్లులో నిర్వహించబడుతున్న G20 డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ సదస్సు సందర్భంగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పరిష్కారాలను అందించే అభివృద్ధి చెందుతున్న కంపెనీలను ప్రదర్శించడానికి, మద్దతు ఇవ్వడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా దీనిని ఏర్పాటు చేశారు.
Rehal కంపెనీ 2018లో స్థాపించారు. ఇది కంపెనీ డేటా మేనేజ్‌మెంట్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IT టెక్నాలజీ రిసోర్సింగ్ మరియు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ రంగాలలో అనేక రకాల సేవలు, ఉత్పత్తులను అందిస్తుంది.
H2SolarO సంస్థ కంపెనీలకు గ్రీన్ ఎకానమీ సొల్యూషన్‌లను అందించడానికి పని చేస్తుంది. నిక వ్యవసాయ వనరుల నుండి ఉత్పన్నమైన జీవ ఇంధనాల అభివృద్ధి, ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో అనేక రకాల ఉత్పత్తులు, సేవలను అందిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







