వదిలేసిన కార్ల పై 3,000 దిర్హామ్ల జరిమానా
- August 19, 2023
యూఏఈ: అబుధాబిలోని అల్ దఫ్రా రీజియన్లోని అధికారులు వదిలివేసిన కార్లపై కఠిన చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీకి చెందిన బృందాలు అవగాహన ప్రచారాన్ని ప్రారంభించాయి. పార్కింగ్ స్థలాలు, బహిరంగ ప్రదేశాలలో పాడుబడిన కార్లను క్లియర్ చేయడానికి తనిఖీలను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను అధికారులు తెలియజేస్తున్నారు. నిర్లక్ష్యంగా కార్లను వదిలేయడం అనేది 3,000 దిర్హామ్ జరిమానా, వాహన జప్తు చేసే శిక్షార్హమైన నేరంగా అధికారులు హెచ్చరిస్తున్నారు. అవగాహన పెంపొందించడంతో పాటు, అల్ ధాఫ్రా ప్రచారం ప్రజారోగ్యాన్ని కాపాడటం, స్థలాలను శుభ్రంగా ఉంచడం, స్థిరమైన వ్యర్థ పదార్థాల నిర్వహణను నిర్ధారించడం లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. నివాసితులు తమ కార్ల పరిశుభ్రతను ఎల్లప్పుడూ నిర్వహించాలని, ఎక్కువ కాలం వాటిని ఆరుబయట వదిలేయకుండా తగిన నిర్వాహణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు









