24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- April 12, 2026
మనామా: జాతీయ ఆహార సరఫరాలను పరిరక్షించడానికి మరియు నిత్యావసర వస్తువుల లభ్యతను నిర్ధారించడానికి బహ్రెయిన్ 24-గంటల ఆపరేషన్స్ రూమ్‌ను ప్రారంభించింది. ఈ మేరకు ఎంపీ హసన్ ఇబ్రహీం ప్రశ్నకు సమాధానంగా పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ అడెల్ ఫఖ్రో పార్లమెంటుకు తెలిపారు.
వాణిజ్య మార్గాలను ప్రభావితం చేస్తున్న ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంకా ఉన్నప్పటికీ, స్థానిక డిమాండ్‌ను తీర్చడానికి నిత్యావసర ఫుడ్ స్టాక్ సరిపోతుందని ఆయన అన్నారు.
ధరల పర్యవేక్షణ
అన్యాయమైన ధరల పెంపును నిరోధించడానికి మంత్రిత్వ శాఖ తనిఖీలను ముమ్మరం చేసింది. చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటోంది. ధరల పెంపునకు గాను అధికారులు నాలుగు వ్యాపార సంస్థలను మూసివేశారు. ఒక కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు నివేదించగా, ఇతరులకు హెచ్చరికలు జారీ చేసి, వారి ధరలను సరిదిద్దుకోవాలని ఆదేశించారు.
నిరంతరం తనిఖీ బృందాలు మార్కెట్లు, షాప్స్, వేర్ హౌజ్ లు మరియు సఫ్లై సెంటర్లలో ప్రతిరోజూ తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా ఇన్వాయిస్లు, సఫ్లై చైన్స్ మరియు ఖర్చులను సమీక్షిస్తున్నాయి.
24/7 పర్యవేక్షణ వ్యవస్థ
లాజిస్టిక్స్ ను వేగవంతం చేయడానికి, కీలక సరఫరాదారుల కోసం సంధాన అధికారులతో పాటు, 24 గంటలూ పనిచేసే ఒక ఆపరేషన్స్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. స్థానిక ఆహార ఉత్పత్తిని బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖ ఆర్థిక అభివృద్ధి బోర్డుతో కలిసి పనిచేస్తూనే, ప్రాంతీయ సఫ్లై చైన్స్ ను సురక్షితం చేయడానికి GCC భాగస్వాములతో సహకరిస్తోందని మంత్రి ఫఖ్రో వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్ లీజు ముందే ముగిస్తే.. అద్దె రీఫండ్‌కు అవకాశం..!!
- సౌదీలో దాడులపై మక్కా రక్షణ ఒప్పంద దేశాలు ఆగ్రహం..!!
- 2027లో బెస్ట్ ట్రావెల్ డెస్టినేషన్లలో ఒమన్..!!
- కువైట్‌లో ఫైర్ ఫోర్స్ కొత్త వాట్సాప్ సర్వీస్..!!
- బహ్రెయిన్‌లో డైవింగ్ సెంటర్లలో తనిఖీలు..!!
- ఎల్డీసీలకు అంతర్జాతీయ మద్దతు పెంచాలి: ఖతార్
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా







