భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- April 12, 2026
దమ్మామ్: సౌదీ అరేబియాలో కొనసాగుతున్న భారీ వర్షాలు, వాతావరణ హెచ్చరికల నేపథ్యంలోపలు ప్రాంతాల్లో డైరెక్ట్ క్లాసెస్ ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
తూర్పు ప్రావిన్స్, అల్-బహా మరియు అసిర్‌లోని విద్యా సంస్థలు పాఠశాలల్లో ప్రత్యక్ష హాజరును నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. "మదరసాటి" ప్లాట్‌ఫారమ్ ద్వారా రిమోట్ లెర్నింగ్‌కు మారినట్లు తెలిపాయి.
జాతీయ వాతావరణ కేంద్రం నివేదికల ఆధారంగా, తూర్పు ప్రావిన్స్‌లోని దమ్మామ్తో పాటు ఖోబార్, ఖతీఫ్, జుబైల్, రాస్ తానూరా, అబ్కైఖ్ మరియు అల్-అహ్సా వంటి గవర్నరేట్లలో తరగతులను నిలిపివేశారు. భద్రతా కారణాలను పేర్కొంటూ.. అల్-బహా అధికారులు బని హసన్, బల్జురాషి మరియు అల్-మండాక్ వంటి కేంద్ర ప్రాంతాలు మరియు గవర్నరేట్లలో కూడా క్లాసులను రద్దుచేశారు.
అసిర్‌లో, అభా, ఖమీస్ ముషైత్, అహద్ రఫీదా, సరత్ అబిదా, అల్-నమాస్, ధహ్రాన్ అల్-జనౌబ్, తానోమా, బల్కార్న్, అల్-హర్జా, అల్-రబోవా మరియు అల్-ఫర్షాతో సహా రెడ్ వెదర్ అలర్ట్‌ల పరిధిలోని అన్ని పాఠశాలలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొన్నారు.
అల్-బహా విశ్వవిద్యాలయం, కింగ్ సౌద్ బిన్ అబ్దుల్ అజీజ్ యూనివర్సిటీ ఫర్ హెల్త్ సైన్సెస్ మరియు కింగ్ ఖాలిద్ విశ్వవిద్యాలయంతో సహా పలు విశ్వవిద్యాలయాలు కూడా తరగతులను రద్దు చేశాయి. వాతావరణ హెచ్చరికలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపాయి. అయితే, విద్యార్థులు మరియు సిబ్బందికి తరగతులు ఆన్లైన్లో కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
మరోవైపు, రియాద్‌ను ముంచెత్తుతన్న భారీ వర్షం సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగుతుందని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్‌లోని నివాసితులు అప్రమత్తంగా ఉండాలని పౌర రక్షణ శాఖ కోరింది. ఇదిలా ఉండగా, మంగళవారం వరకు చాలా ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గతంలో వాతావరణ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఏపీలో 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు.. కేబినెట్ ఆమోదం..!
- ఖోర్‌ఫక్కాన్ పోర్టును సందర్శించిన భారత కాన్సుల్ జనరల్ డా. విష్ణువర్ధన్ రెడ్డి
- UNGAలో జైశంకర్ వరుస భేటీలు.. AI, అంతరిక్షం, UNSC సంస్కరణల పై చర్చలు
- సౌదీలో తెలుగు ప్రవాసులది ప్రత్యేక ఉత్సాహం..భారత రాయబారి విపుల్
- ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్
- భారత్–ఖతార్ సంబంధాల బలోపేతం పై చర్చలు
- 120 మంది కార్మికులకు ఎండ నుంచి రక్షణ పై దుబాయ్ పోలీసుల అవగాహన
- ‘ఇరాన్ ఎప్పటికీ తలవంచదు’..ఐరాసలో అధ్యక్షుడు పెజెష్కియన్
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి సంతాపాలు
- 28న మదురైలో ‘మేనమామ బంగారు ఉంగరం పథకం’ ప్రారంభం







