ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధo..
- May 18, 2016
దాదాపు రెండు నెలల పాటు సాగిన ఎన్నికల సమరానికి తెరపడింది. మరో 24 గంటల్లో పోరు ఫలితాలు వెలువడనున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
కేరళ, తమిళనాడు, పశ్చిమ్‌బంగ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో గురువారం(మే 19) అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఐదు రాష్ట్రాల్లో బరిలో ఉన్న ప్రముఖ అభ్యర్థుల భవితవ్యం తెలిసిపోతుందన్నారు. 3 గంటల వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది.మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరిగిన తర్వాత ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఎన్నికల ఫలితాలు వెలువడగానే.. గెలుపొందిన అభ్యర్థుల జాబితాను గెజెట్ రూపంలో విడుదల చేస్తారు.మే 16తో ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆయా రాష్ట్రాల్లో పార్టీల భవితవ్యం ఎలా ఉండనుందో ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన విషయం తెలిసిందే.ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కేరళ, తమిళనాడు, అసోంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు తెలిసింది. తమిళనాడులో అమ్మ, కేరళలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం కన్పించలేదు. మరోవైపు ఈశాన్య రాష్ట్రమైన అసోంలో తొలిసారిగా భాజపా జెండా ఎగరనుంది. ఒక్క పశ్చిమ్‌బంగలో మాత్రమే మరోసారి మమతాబెనర్జీకి అధికారం కట్టబెట్టనున్నారు. ఇక కేంద్ర పాలితప్రాంతమైన పుదుచ్చేరిలో మాత్రం డీఎంకే కూటమితో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశముంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







