సెయిలర్స్ భద్రతకు అజ్మన్ పోర్ట్ పెద్ద పీట
- May 18, 2016
అజ్మన్ పోర్ట్ అథారిటీస్, నౌకలపై ఉండే క్రూ మెంబర్స్ హక్కుఉaల, భద్రతకు సంబంధించి కొత్త నిబంధనల్ని ప్రవేశపెడుతున్నారు. పోర్ట్‌కి వచ్చే షిప్ సైజు, సిబ్బందిని బట్టి సెక్యూరిటీ డిపాజిట్ కింద 100,000 ముందస్తుగా చెల్లించడం ఈ కొత్త విధానంలో ముఖ్యమైన రూల్ అని మెరైన్ ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ నాజర్ ఒబైద్ అల్ సువ్వైది చెప్పారు. లేబర్ డిస్‌ప్యూట్ ఏదైనా సంభవించినప్పుడు, పోర్ట్ అథారిటీస్, డిపాజిట్ సొమ్ములోంచి క్రూ సిబ్బందికి, కార్మికులకు వేతనాలు చెల్లించేలా ఈ నిబంధన వీలు కలిపిస్తుంది. ఎలాంటి వివాదాలూ లేకుండా ముందస్తుగా కెప్టెన్‌తో సంప్రదింపులు జరిపే విధానాన్ని కూడా సరికొత్త నిబంధనల్లో పొందుపర్చారు. గత ఏడు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడంలేదంటూ అజ్మన్ పోర్ట్‌లో నిలిపిన పిగాసోస్ అనే కెమికల్ ట్యాంకర్ సిబ్బంది ఆందోళన చేయడంతో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. పిగాసోస్ సిబ్బంది సమస్యల్ని పరిష్కరించేలా కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అల్ సువైది చెప్పారు. కొందరు సిబ్బంది షిప్‌కి సంబంధించిన సంస్థతో సరైన కాంట్రాక్ట్ లేకుండా కూడా పనిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందనీ, ఇలాంటి సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. సిబ్బందితో వివాదాలున్న కంపెనీల్ని బ్లాక్ లిస్ట్‌లో పెడతామనీ, అలాంటి కంపెనీల నుంచి వచ్చే షిప్‌లను హార్బర్‌లోకి అనుమతించబోమని అల్ సువ్వాది స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







