రతన్ టాటాకు ఉద్యోగ రత్న అవార్డు
- August 19, 2023
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా కు మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ రత్న అవార్డును ఇచ్చి సత్కరిచింది. శనివారం సీఎం ఏక్ నాథ్ షిండే ,డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ చేతుల మీదుగా ఉద్యోగ రత్న అవార్డును ప్రధానం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ఉద్యోగ రత్న అవార్డు రతన్ టాటాను వరించింది. 85 ఏళ్ల రతన్ టాటా ఆరోగ్య సమస్యలతో బాధపడపడుతున్న విషయం తెలిసిందే. దీంతో దక్షి ముంబైలోని రతన్ టాటా ఇంటి వద్దకే వచ్చి అవార్డును సీఎం అందజేశారు. అవార్డుతో పాటు మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (MIDC) నుండి శాలువా, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. రతన్ టాటా, టాటా గ్రూప్స్ దేశానికి ఎనలేని సేవలందించాయన్నారని..అన్ని రంగాల్లోను టాటా గ్రూప్ విస్తరించిందని ఎన్నో వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డును స్వీకరించిన రతన్ టాటాకు ధన్యవాదాలు తెలిపారు.
కాగా..మహారాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ‘ఉద్యోగ రత్న’ అవార్డును తీసుకువచ్చింది. విశిష్ట వ్యక్తులకు ఇచ్చే మహారాష్ట్ర భూషణ్ అవార్డు మాదిరిగానే రతన్ టాటాను ఉద్యోగ రత్న అవార్డుతో సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టాటా గ్రూపు ఆరు ఖండాల్లో 100కిపైగా దేశాల్లో టాటా గ్రూప్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో టాటా కంపెనీల మొత్తం ఆదాయం 128 బిలియన్ డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







