ట్రాఫిక్ జరిమానాలు చెల్లించని ప్రవాసుల ప్రయాణంపై కువైట్ నిషేధం
- August 20, 2023
కువైట్: ప్రతి విదేశీయుడు లేదా ప్రవాసుడు ఏ కారణం చేతనైనా దేశం విడిచి వెళ్లే ముందు ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానా చెల్లించాలని కువైట్‌లోని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విదేశీయుల నివాసం చట్టంపై 1959 డిక్రీ నెం. 17 మరియు ట్రాఫిక్‌కు సంబంధించి 1976 డిక్రీ చట్టం నెం. 67 ఆధారంగా చెల్లించాల్సిన అప్పులను వసూలు చేసే ప్రక్రియల కొనసాగింపులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్‌ను విడిచి వెళ్లాలనుకునే ప్రతి ప్రవాసుడు, ఏ కారణం చేతనైనా తనపై నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనలను ఎలక్ట్రానిక్ పోర్టల్ ద్వారా చెల్లించాలి లేదా గవర్నరేట్‌లు లేదా సంబంధిత కార్యాలయాలలో జనరల్ ట్రాఫిక్ విభాగానికి అనుబంధంగా ఉన్న విభాగాలలో చెల్లించాలని సూచించింది. ఈ నిర్ణయం ఆగస్ట్ 19 నుంచి అమల్లోకి వచ్చిందని గుర్తుచేసింది. జరిమానాలు చెల్లించడానికి అనేక యూజర్ ఫ్రెండ్లీ పద్ధతులు ఉన్నాయని పేర్కొంది. సహెల్ మొబైల్ యాప్, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క వెబ్ పోర్టల్, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం, సీ పోర్ట్‌లు, జనరల్ ట్రాఫిక్ విభాగాలలోని ట్రాఫిక్ సేకరణ కార్యాలయాలలో ట్రాఫిక్ ఉల్లంఘనలను తెలుసుకుని జరిమానాలను చెల్లించవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







