వివాదంలో చిక్కుకున్న మంత్రి తలసాని
- August 20, 2023
హైదరాబాద్: వివాదాలకు దూరంగా ఉండే బిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..తాజాగా వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచారు. హైదరాబాద్‌లో ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ చౌరస్తా వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి (దివంగత నేత నాయిని నరసింహారెడ్డి ఫ్లైఓవర్)ని శనివారం మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.
కాగా ఈ ప్రారంభ కార్యక్రమంలో ఓ వ్యక్తిని మంత్రి తలసాని కొట్టడం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బ్రిడ్జి చూసేందుకు ఓ వ్యక్తి తలసాని కంటే ముందు వెళ్లారు. దీంతో అతన్ని వెనక్కి లాగి, చెంప దెబ్బ కొట్టారు తలసాని. దీంతో మంత్రిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దక్షిణ భారత దేశంలో రహదారిపై భారీ పొడవున స్టీల్ వినియోగంతో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టు ఇదే. రూ.450 కోట్లతో 2.63 కిలోమీటర్ల మేర ఈ ఉక్కు వంతెన నిర్మించారు. జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే భూ సేకరణ అవసరం లేకుండా జరిగిన ప్రాజెక్టు, అందులో మెట్రో మార్గం మీదుగా ఈ స్టీట్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ, హిందీ మహావిద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇందిరా పార్క్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ట్రాఫిక్ సమస్య లేకుండా వీఎస్టీ జంక్షన్ వరకు సులభంగా వెళ్లొచ్చు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







