భారత దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
- August 20, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశ వ్యాప్తంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గే, పలువురు కాంగ్రెస్ నేతలు రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. అంతకుముందు లద్దాఖ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం తోపాటు మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. సోమాజీగూడలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిన్న వయస్సులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఆనాడు రాజీవ్ గాంధీ చేసిన కృషితోనే ఐటీ అభివృద్ధి చెందింద న్నారు రేవంత్ రెడ్డి.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







