తెలంగాణలో ఇద్దరు గల్ఫ్ ఏజెంట్ల అరెస్ట్
- August 20, 2023
తెలంగాణ: గల్ఫ్ పంపిస్తామని మోసం చేసిన జగిత్యాల జిల్లాలోని మ్యాన్ పవర్ కన్సల్టెన్సీకి చెందిన ఇద్దరు ఏజెంట్లను అరెస్టు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ వెంకటస్వామి తెలిపారు. జిల్లా కేంద్రం లోని టౌన్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన వివరాలు వెల్లడించారు. బుగ్గారం మండలం శేకల్లకు చెందిన రాచకొండ మహేశ్, పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన మహేశ్ జగిత్యాలలో విఘ్నేశ్వర మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశారు. గల్ఫ్ కు పంపిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేశారు. వారం కింద 120 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎంక్వైరీ చేపట్టారు. ఎస్పీ భాస్కర్ ఆదేశాలతో మూడు టీంలు ఏర్పాటు చేసి నిందితులను అరెస్టు చేశారు. బాధితుల నుంచి రూ.2.90 కోట్లు వసూలు చేసినట్లు తేలిందన్నారు.
నిందితుల వద్ద రెండు కార్లు, మూడు తులాల బంగారం, .ఐదు లక్షల విలువ చేసే ఫోన్లు,2.50లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు,ఏసీలు స్వాధీనం చేసుకున్నాట్లు డీఎస్పీ వివరించారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,ఉమ్మడి కరీంనగర్ జిల్లా)
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







