చైనా ప్రభుత్వం 2020 సంవత్సరం నాటికి దేశంలో 500 విమానాశ్రయాలు నిర్మించాలని ప్రణాళిక..
- May 18, 2016
చైనా ప్రభుత్వం 2020 సంవత్సరం నాటికి దేశంలో 500 విమానాశ్రయాలు నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సుమారు 153 బిలియన్ అమెరికా డాలర్ల వ్యయంతో అధిక సంఖ్యలో విమానాశ్రయాలు నిర్మించి విమానయానానికి మార్కెట్ పెంచే ప్రయత్నం చేస్తోంది. చైనా సెంట్రల్ కేబినెట్ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 500 విమానాశ్రయాలు నిర్మించనున్నారు. వ్యవసాయ, అటవీ ప్రాంతాల్లో, పర్యాటక ప్రాంతాల్లోనూ కొత్త విమానాశ్రయాలు వచ్చే అవకాశం ఉంది.విమానాల సంఖ్యను కూడా పెంచాలని చైనా నిర్ణయించింది. 2020 నాటికి హెలికాప్టర్లు, ప్రైవేటు జెట్స్, సాధారణ విమానాలు సహా అన్నింటి సంఖ్యను పెంచనున్నారు. 2020 నాటికి 5వేలకు పైగా విమానాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చైనా ఇటీవల మే 12న వైమానిక రంగంలో 723.8 మిలియన్ అమెరికా డాలర్లు ఖర్చు చేస్తామని ప్రకటించింది. చైనా రైల్వేలు, జాతీయరహదారులు, జలమార్గాలు, విమానాశ్రయాలు, అర్బన్ రైల్ ట్రాన్సిట్‌ల కోసం 303 ప్రాజెక్టులకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉంది. చైనా ఆర్థికవృద్ధి గత ఏడాది 6.9శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జీడీపీ రేటు 6.5 నుంచి ఏడు శాతానికి పెంచాలని చైనా ప్రయత్నిస్తోంది. విమానయాన రంగాన్ని వృద్ధి చేయడానికి ప్రైవేటు పెట్టబడులను కూడా ఆహ్వానిస్తోంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







