సౌదీలో చిక్కుకుపోయిన 150మంది తెలంగాణ కార్మికులు
- August 21, 2023
రియాడ్: సౌదీ అరేబియాలో 150 మంది భారతీయులు చిక్కుకున్నారు. వారంతా గతేడాదే సౌదీకి ఉద్యోగం కోసం వచ్చారు. కొన్నాళ్ల క్రితం చేస్తున్న ఉద్యోగం కోల్పోవడంతో గత 45 రోజులుగా వారంతా ఆకలి దప్పికలతో అలమటిస్తున్నారు. తమ స్వస్థలాలకు వచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందించాలని వారు కోరుతున్నారు. సౌదీలో చిక్కుకుపోయిన వారంతా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట్, కరీంనగర్, మంచిర్యాల్, రాజన్న సిరిసిల్లా, జోగులాంబ గద్వాల్ జిల్లా వాసులు. రియాద్ మునిసిపాలిటీలోని సప్లై డిపార్టుమెంట్ లో జూన్ 2022లో వారు ఉగ్యోగానికి చేరారు. 13 నెలలపాటు ఉద్యోగం చేస్తే.. కేవలం 11నెలల జీతం మాత్రమే అందిందని బాధితులు వాపోయారు. తమను గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారని, టెంట్లలో పెట్టారని పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న ఇఖామా(రెసిడెన్స్ వీసా)ను ఆకస్మికంగా రద్దు చేశారని బాధితుడు దేవారెడ్డి మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







