దసరా కానుకగా పెండింగ్ డీఏ: సిఎం జగన్
- August 21, 2023
విజయవాడ: సిఎం జగన్ విజయవాడలో జరుగుతున్న ఏపీ ఎన్జీవో 21వ రాష్ట్ర మహాసభలకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఏపీ ఎన్జీవో సంఘం సభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఒక డీఏను దసరా కానుకగా ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.
వైద్య రంగంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు రోజుల క్యాజువల్ లీవ్స్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు అడిగినవన్నీ ఇవ్వలేకపోవచ్చని, కానీ ప్రభుత్వం తమదని ఉద్యోగులు భావించాలని కోరారు. గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) పై త్వరలోనే ఆర్డినెన్స్ వస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి భారం పడకుండా, ఉద్యోగులకు నష్టం లేకుండా జీపీఎస్ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
2019 నుంచి ఇప్పటిదాకా 3.19 లక్షల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించామని వివరించారు. 2.06 లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని చెప్పారు. వేతనాలపై రూ.3,300 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







