కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాంది చరిత్ర సృష్టించారు
- May 18, 2016
కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాంది చరిత్ర సృష్టించారు. కేరళలో అత్యధిక రోజులు సీఎంగా కొనసాగిన ఘనత సాధించారు. సీఎంగా ఆయన బుధవారం నాటికి 1,827 రోజులు పూర్తి చేసుకున్నారు. ఐదేళ్ల కాలంలో ఎక్కువ రోజులు సీఎంగా కొనసాగిన రికార్డు సొంతం చేసుకున్నారు.రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తన కంటే ముందు సీఎంగా పనిచేసిన వీఎస్ అచ్యుతానందన్ రికార్డును అధిగమించారు. అచ్యుతానందన్ 1,822 రోజులు సీఎంగా పనిచేశారు.తాజాగా కేరళ అసెంబ్లీకి సోమవారం ఎన్నికలు జరిగాయి. అయితే మరో పర్యాయం చాందికి అవకాశం దక్కకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ముందస్తు సర్వేలు అంచనాలు తప్పుతాయని, మళ్లీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని చాంది విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారం నిలబెట్టుకుంటామని దీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







