త్వరలో భారత్‌కు ఇజ్రాయెల్ హోటల్..
- May 18, 2016
ఇజ్రాయెల్‌లోని ప్రముఖ గొలుసు హోటళ్లలో ఒకటైన డాన్ హోటల్స్ త్వరలో భారత్‌కు రానుంది. బెంగళూరులో తమ తొలి విదేశీ వెంచర్‌ను ప్రారంభించనున్నట్లు హోటల్ సీఈవో రఫీ సాదే తెలిపారు. 230 గదులతో ఈ హోటల్ నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. మరో 10-12 నెలల్లో హోటల్‌ను ప్రారంభిస్తామని రఫీ తెలిపారు.ఇజ్రాయెల్‌కి చెందిన అనేక హైటెక్ కంపెనీలు బెంగళూరులో ఉండటంతో.. హోటల్ వ్యాపారం పెరుగుతుందన్నారు. త్వరలోనే భారత్ వ్యాప్తంగా తమ వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పారు. భారత్‌లో హోటల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని.. దేశ ప్రభుత్వం, స్థానిక అధికారుల నుంచి తమకు అన్నివిధాల సహకారం అందుతోందని.. హోటల్ నిర్మాణ పనులను పర్యవేక్షించే గిది ఫెడర్‌మన్ తెలిపారు
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







