అల్లంతో మలబద్ధకం సమస్యకు చెక్.!
- August 22, 2023
మలబద్ధకం ఓ చెప్పుకోలేని తీవ్రమైన సమస్య. మరి, ఈ సమస్యను నివారించుకోవాలంటే సింపుల్‌గా ఇంటి చిట్కాలతోనే సాధ్యమవుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యను సునాయాసంగా తగ్గించుకోవడమెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లంలో జింజెరాల్ పుష్కలంగా వుంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ బాగుంటే, మలబద్ధకం వంటి సమస్యలు దరి చేరవు.
అందుకోసం చాలా సింపుల్. రోజూ మనం తీసుకునే టీలో కాస్తంత అల్లం జోడిస్తే సరి. అల్లం టీ తాగడం వల్ల జీర్ణక్రియ బాగుండి. కడుపు శుద్ధి అవుతుంది. తద్వారా మలబద్దకం సమస్య వుండదు.
అంతేకాదు, అప్పుడప్పుడూ కలిగే కడుపు నొప్పి, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఎసిడీటీ వంటి సమస్యలు కూడా అల్లం రెగ్యులర్‌గా తినడం వల్ల దూరమైపోతాయ్. రాత్రిపూట పడుకునే ముందు కొద్దిగా అల్లాన్ని చితక్కొట్టి గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగి పడుకుంటే, జీర్ణ క్రియ బాగా జరిగి, తెల్లారే సరికి కడుపు క్లీన్ అవుతుంది. తద్వారా ఫ్రీ మోషన్ అవుతుంది. ఇలా తరచూ చేయడం వల్ల మలబద్దకం అనే సమస్యే దరి చేరదని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి