తూచ్.! ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆగిపోలేదట.!

- August 22, 2023 , by Maagulf
తూచ్.! ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆగిపోలేదట.!

హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటించబోయే సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాకి మొదట్నుంచీ ఆటంకాలే. అనుకోని కారణాలతో అనేక రూమర్లు.. ఇంకేముంది ఈ మధ్య అయితే, సినిమా ఆగిపోయిందంటూ గట్టిగా ప్రచారం మొదలెట్టారు.

అయితే, ఈ సినిమా ఆగిపోలేదట. సెప్టెంబర్ 5 నుంచి నెక్స్‌ట్ షెడ్యూల్ షూటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా వుండడం వల్ల ఆయన ఎక్కడుంటే అక్కడి నుంచే ఈ సినిమా షూటింగ్ చేసేస్తానని హరీష్ శంకర్ గతంలో చెప్పారు.

అయితే, అది కుదరలేదు. కానీ, కొన్ని రోజులు డేట్స్ కేటాయించారట పవన్ కళ్యాణ్. ఆ డేట్స్‌లోనే చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ చేయాలని హరీష్ రంగం సిద్ధం చేస్తున్నాడట. 

మరోవైపు ‘ఓజీ’ షూటింగ్ కూడా పవన్ ముందున్న మరో బిగ్ సవాల్. ఈ సినిమా కోసం విదేశాలకు వెళ్లాల్సి వస్తుందని ప్రచారం జరుగుతోంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ విదేశాలకు వెళ్లడం సాధ్యమయ్యే పనేనా.! అక్టోబర్‌లో కొన్ని రోజులు, నవంబర్‌లో కొన్ని రోజులు అందుకోసం టైమ్ కేటాయించినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com