చంద్రయాన్ మిషన్ డైరెక్టర్ మన తెలుగువాడు
- August 24, 2023
బెంగుళూరు: చంద్రయాన్-3 విజయవంతంగా చందమామను చేరగానే తొలుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆ వెంటనే ఇస్రో చైర్మన్ మాట్లాడి, ఈ మిషన్ వెనుకున్న కీలక వ్యక్తుల్ని ప్రపంచానికి పరిచయం చేసారు. వారిలో ఏకైక తెలుగు శాస్త్రజ్ఞుడు మోటమర్రి శ్రీకాంత్.
శ్రీకాంత్ స్వస్థలం విశాఖపట్నం. మచిలీపట్నం నిర్మల హై స్కూల్ నుంచి పదవ తరగతి(1994 బ్యాచ్) పాసయ్యారు.అయితే ఈయనకు సైన్సులో బీజాలు మచిలీపట్నం హిందూ కళాశాలలో పడ్డాయి. అక్కడ మొదటి సంవత్సరం బీ.ఎస్సీ చదవగా, తర్వాతి రెండేళ్లు విశాఖ ఏ.వి.ఎన్ కాలేజీలో చదివారు. పిదప ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పట్టాపొందారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి ఎంటెక్ పూర్తి చేసారు. అనంతరం తన ప్రతిభను చూపి ఎంతో పోటీకి తట్టుకుని బెంగళూరులో ఇస్రో సైంటిష్టుగా చేరారు.
వృత్తే ధ్యేయంగా జీవిస్తూ అంచెలంచెలుగా వివిధ హోదాల్లో పని చేస్తూ వస్తున్నారు. మార్స్ మిషన్ కి ఆపరేషన్ డైరెక్టర్, చంద్రయాన్-2 కి డిప్యూటీ మిషన్ డైరెక్టర్ ఈయనే. ఇప్పుడు ప్రపంచం గర్వంగా చెప్పుకుంటున్న చంద్రయాన్-3 కి మిషన్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన శాస్త్రవేత్త మోటమర్రి శ్రీకాంత్. ప్రస్తుతం ఈయన బెంగళూరులో జీవిస్తున్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను, ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువాళ్లు ఇది గర్వపడాల్సిన విషయం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!









