భారత్ చంద్రుడి పై తన నడకను ప్రారంభించింది: ఇస్రో ట్వీట్
- August 24, 2023
బెంగళూరు: భారత్ చంద్రయాన్-3 అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించింది. రోదసిలో ఇప్పటివరకు ఏ దేశమూ అందుకోలేకపోయిన లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువం పై విక్రమ్ ల్యాండర్ ను దించింది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండ్ అయిన కొన్ని గంటల తర్వాత దాని లోపలి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం వెల్లడించింది.
ఈ మేరకు గురువారం ఉదయం ఓ ట్వీట్ చేసింది. ‘చంద్రుడి కోసం చంద్రయాన్-3 రోవర్ భారత్‌లో తయారైంది. ఇప్పుడు అది ల్యాండర్ నుంచి బయటకు వచ్చింది. దీంతో భారత్ చంద్రుడిపై తన నడకను ప్రారంభించింది’ అని ఇస్రో తన ట్వీట్‌లో పేర్కొంది. చంద్రుడి గుట్టు విప్పడంలో ప్రజ్ఞాన్ రోవర్ ముఖ్య పాత్ర పోషించనుంది. సెకనుకు ఒక్కో సెం.మీ వేగంతో ఇది ల్యాండర్ ర్యాంపు ద్వారా వడివడిగా బయటకు వచ్చింది.
తాజా వార్తలు
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!







