బహ్రెయిన్ లో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు

- August 24, 2023 , by Maagulf
బహ్రెయిన్ లో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు

: ఎన్నారై రాయుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో  బెహిరన్లో మెగాస్టార్ చిరంజీవి 68. వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

 ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ మురళి ఆశా దంపతులు, నవభారత్ ప్రదీప్ కుమార్, హరిప్రసాద్ తెలంగాణ జాగృతి, మోహన్ మురళీధర్ దంపతులు,స్వాతి గారు తో పాటు 60కి పైగా మెగా అభిమానులు పాల్గొన్నారు.యాంకర్ హరిణి మరియు రఘు ల జోష్ తో ఉత్తేజ భరి తంగా పలు సాంస్కృతిక కార్యక్రమాల తో   నిర్వహించి,అనందం తో ఆటపాటల కార్యక్రమాలుతో,  నిర్వాహకులు దొడ్డిపాటి శ్రీనివాస్,, నగేష్ మాట్లాడుతూ అందరూ సంతోషంగా మెగాస్టార్ చిరంజీవి పట్ల తమకున్న ప్రేమాభిమానాలను వ్యక్తపరుస్తూ ఆనందోత్సాహాలతో కేక్ కటింగ్ చేసుకొని  సంబరంగా జరుపుకున్నామని తెలియజేశారు.

 అఖిల భారతీయ చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు పిలుపుమేరకు   మెగా అభిమానులు ఎన్నారైలు బహ్రెయిన్ లో  30 మందికి పైగా రక్తదానం ఇచ్చి చిరంజీవి పై ఉన్న ప్రేమను చాటారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com