నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం..ఆరుగురు భారతీయులు మృతి
- August 24, 2023
ఖాట్మండు: గురువారం(ఈరోజు) ఉదయం నేపాల్ లో ఘోర ప్రమాదం సంభవించింది. మొత్తం 26 మంది యాత్రీకులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు మరణించగా.. అందులో ఆరుగురు భారతీయులేనని నేపాల్ అధికారులు తెలిపారు. రాజస్థాన్ నుంచి తీర్థయాత్రలకు వచ్చిన వారిలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారని వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యాత్రీకులను బస్సులో నుంచి బయటకు తీశారు. గాయపడిన వారిని హెటౌడలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
నేపాల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన పలువురు నేపాల్ లో తీర్థయాత్రలకు వచ్చారు. మిగతా యాత్రికులతో కలిసి గురువారం ఉదయం బస్సులో ఖాట్మాండు నుంచి జానక్ పూర్ బయలుదేరారు. జీత్పూర్ సిమారాలోని చురియమై ఆలయం సమీపంలో బస్సు అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న 15 మీటర్ల లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 26 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా, ప్రమాదం తర్వాత ప్రాణాలతో బయటపడ్డ బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







