పాఠశాలల దగ్గర శబ్దాలు చేస్తే SR500 జరిమానా

- August 24, 2023 , by Maagulf
పాఠశాలల దగ్గర శబ్దాలు చేస్తే SR500 జరిమానా

రియాద్: వాహనం లోపల పరికరాలను ఉపయోగించడం ద్వారా శబ్దం సృష్టించడం లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు పబ్లిక్ నైతికతలకు విరుద్ధంగా ప్రవర్తించడం  ట్రాఫిక్ ఉల్లంఘనగా పరిగణించబడుతుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ (మురూర్) పేర్కొంది. విద్యా భవనాల దగ్గర శబ్దాలు చేయడం, విద్యార్థులు తరగతుల సమయంలో వారికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే SR300- SR500 మధ్య జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అలాగే పిల్లలను ఎక్కించడానికి,  దించడానికి నిలపే పాఠశాల బస్సులను దాటవద్దని సూచించింది. ఇది ఉల్లంఘనగా పరిగణించబడుతుందని,  ఎవరైనా పాఠశాల బస్సుల ద్వారా ప్రయాణిస్తున్నట్లు గుర్తించినట్లయితే SR3,000 -SR6,000 మధ్య జరిమానా విధించబడుతుందని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com