అంతరిక్ష రంగంలో భారత్ చారిత్రాత్మక విజయం
- August 24, 2023
కువైట్: చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా భారత అవతరించింది. చంద్రయాన్-3 వ్యోమనౌక బుధవారం చంద్రుని ఉపతరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్, ఆపై లునార్ మూన్ పై కాలుమోపడం చకచకా వియవంతంగా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో హిస్ హైనెస్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా భారత ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో ఈ చారిత్రాత్మక విజయం మొత్తం మానవాళికి ఉపయోగపడుతుందని, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాధించిన ఈ ఘనత చిరస్మరణీయమని తన సందేశంలో హిస్ హైనెస్ అమీర్ పేర్కొన్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
కువైట్ క్రౌన్ ప్రిన్స్ హిస్ హైనెస్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైనందుకు అభినందనలు తెలుపుతూ కేబుల్ పంపారు. కువైట్ ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా కూడా ఈ అద్భుతమైన విజయానికి భారతదేశాన్ని అభినందిస్తూ భారత ప్రధానికి అభినందన సందేశాన్ని పంపారు.
తాజా వార్తలు
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..









