వాహనదారుల ఉల్లంఘనల నమోదుకు ఆగస్ట్ 27 నుంచి కొత్త సిస్టమ్

- August 24, 2023 , by Maagulf
వాహనదారుల ఉల్లంఘనల నమోదుకు ఆగస్ట్ 27 నుంచి కొత్త సిస్టమ్

దోహా: వాహనదారులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీటు బెల్ట్ ధరించకపోవడం, మొబైల్ ఫోన్ ఉపయోగించడం వంటి ఉల్లంఘనలకు జరిమానాల సందేశాలను నేరుగా అందుకోనున్నారు. ఈ తరహా ఉల్లంఘనలు ఆగస్ట్ 27 నుండి కొత్త సిస్టమ్ ద్వారా నమోదు చేయబడతాయి. కొత్త నిర్ణయం రెండు దశల్లో అమలు చేయబడుతుంది. మొదటి దశ ఆగష్టు 27 నుండి సెప్టెంబర్ 2 వరకు ప్రారంభమవుతుంది. అప్పుడు వాహనదారులు ఉల్లంఘన సందేశాన్ని అందుకుంటారు. అది జరిమానా కాదని రాడార్ మరియు స్కేల్స్ విభాగం అధిపతి ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ మేజర్ హమద్ అలీ అల్ ముహన్నడి చెప్పారు.

జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ సెప్టెంబర్ 3 నుండి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీటు బెల్ట్ ధరించకపోవడం, మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల ట్రాఫిక్ ఉల్లంఘనల కోసం ఆటోమేటెడ్ మానిటరింగ్‌ను ప్రారంభిస్తుందని తెలిపారు. అయితే, అవగాహన సమయంలో వచ్చేది అవగాహన సందేశమని, అది జరమానా కాదని గుర్తుచేశారు. రెండవ దశ సెప్టెంబర్ 3 న ప్రారంభమవుతుంది. అప్పుడు ఉల్లంఘన టిక్కెట్ల జారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అల్ ముహన్నాది చెప్పారు. జరిమానా గురించి మాట్లాడుతూ.. ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ నెం. 54 ప్రకారం వాహనదారుల దృష్టిని మళ్లించేలా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ లేదా ఏదైనా ఇతర (విజువల్ టూల్స్) ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం ద్వారా QR500 జరిమానా విధించబడుతుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com