బహ్రెయిన్-భారత సంబంధాల వృద్ధిపై ప్రశంసలు
- August 26, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్-భారత్ మధ్య అన్ని స్థాయిలలో ద్వైపాక్షిక సహకారం స్థిరమైన వృద్ధిని బహ్రెయిన్‌లో భారత రాయబారిగా నియమితులైన వినోద్ కె. జాకబ్ కొనియాడారు. రెండు దేశాలు, ప్రజల మధ్య దృఢమైన దీర్ఘకాలిక స్నేహ సంబంధాలున్నాయని తెలిపారు. బహ్రెయిన్ సాంఘిక అభివృద్ధి మంత్రి ఒసామా బిన్ అహ్మద్ ఖలాఫ్ అల్ అస్ఫూర్ అంబాసిడర్ జాకబ్‌కు స్వాగతం పలికారు. తన దౌత్య బాధ్యతలను నిర్వహించడంలో రాయబారి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఉమ్మడి సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అన్ని రకాల మద్దతును అందించడానికి సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంసిద్ధతను వ్యక్తం చేశారు. బహ్రెయిన్‌లోని భారతీయ ప్రవాస కమ్యూనిటీ చూపుతున్న శ్రద్ధ, ఆసక్తిని అంబాసిడర్ ప్రశంసించారు. రెండు దేశాల ఉమ్మడి ఆకాంక్షలను సాధించడానికి ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







