శృతి హాసన్.. ఇది మరీ టూ మచ్ కదా.!
- August 27, 2023
ఒకప్పుడు స్టార్ హీరోయిన్లలో శృతి హాసన్ పేరు కూడా ముందు వరుసలో వుంటుంది. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరే. ఈ ఏడాది సంక్రాంతికి రెండు పెద్ద సినిమాల్లో శృతి హాసన్ నటించింది.
కానీ, వాటి వల్ల ఆమెకు పెద్దగా ఒరిగిందేమీ లేదనే చెప్పాలేమో. మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేర్ వీరయ్య’, నందమూరి బాలకృష్ణతో ‘వీర సింహా రెడ్డి’ సినిమాల్లో నటించిన శృతి హాసన్ ఇప్పుడు ‘సలార్’ సినిమాలో నటిస్తోంది.
అయినా ఎక్కడా శృతి హాసన్ పేరు వినిపించనే వినిపించడం లేదు. తాజాగా ఆమె పేరు బయటికొచ్చింది. శృతి హాసన్ రెమ్యునరేషన్ విషయంలో కాస్త కిరికిరి చేస్తోందట అంటూ ఓ ప్రచారం తెర పైకి వచ్చింది.
కోటి, కోటిన్నర వరకూ రెమ్యునరేషన్ అడుగుతోందనీ తెలుస్తోంది. అయితే, అంత డిమాండ్ చేసేలా శృతి హాసన్‌కి ప్రస్తుతం ఫేమ్ లేదే.. అని అందరూ పెదవి విరిచేస్తున్నారట.
అవును.. అదీ నిజమే.. పెద్ద పెద్ద ప్రాజెక్టులే టేకప్ చేస్తున్నప్పటికీ ఆ స్థాయిలో శృతి హాసన్‌కి ఆయా సినిమాలు బజ్ క్రియేట్ చేయడం లేదనే చెప్పాలేమో. మరి, ఈ దుష్ప్రచారం ఎందుకు బయటికి వచ్చిందో కానీ, తూచ్.! అలాంటిదేం లేదట అంటూ శృతి హాసన్ సన్నిహిత వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







